![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -463 లో.. పారిజాతాన్ని పిలుస్తాడు శివన్నారాయణ. ఎన్నిసార్లు పిలవాలి పారిజాతమని శివన్నారాయణ అనగానే అలా పిలవడం ఇబ్బంది అయితే నన్ను డార్లింగ్ అని పిలవొచ్చని పారిజాతం అంటుంది. దాంతో శివన్నారాయణ చిరాకుగా మాట్లాడతాడు. ఈ డ్రాయింగ్ బుక్ తీసుకొని వెళ్లి శౌర్యకి ఇవ్వు అంటాడు శివన్నారాయణ. పారిజాతం బుక్ తీసుకొని వెళ్లి శౌర్యకి ఇస్తుంది.
థాంక్స్ గ్రానీ అని శౌర్య చాక్లెట్ ఇస్తుంది. ప్రేమగా శౌర్య చాక్లెట్ ఇస్తుంటే పారిజాతం ఎమోషనల్ అయి తీసుకుంటుంది. వెనకాల కార్తీక్ ఉంటాడు. ఇక ఎప్పటిలాగే పారిజాతానికి చురకలు అంటిస్తాడు. ఆ తర్వాత శౌర్య కేక్ డ్రాయింగ్ వేసుకుంటుంటే అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తను రాగానే డ్రాయింగ్ దాచేస్తుంది శౌర్య. ఆ తర్వాత మళ్ళీ శివన్నారాయణ చాటు నుండి డ్రాయింగ్ చూసి నాకు ఇది ఇవ్వు అని డ్రాయింగ్ తీసుకుంటాడు. ఆ డ్రాయింగ్ పేపర్ తీసుకొని వెళ్లి పారిజాతానికి చూపిస్తాడు. ఇది శౌర్య వేసింది ఎందుకిలా వేసింది.. అసలు ఈ రోజు శౌర్య స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు కనుక్కో అలా కనుక్కుంటే ఈ డబ్బు నీకు ఇస్తానని శివన్నారాయణ అనగానే.. పారిజాతం టెంప్ట్ అయి వెంటనే కాంచనకి ఫోన్ చేస్తుంది. ఏంటి శౌర్యని ఈ రోజు స్కూల్ కి పంపించలేదు.. ఫీజు కట్టలేదా అని కాంచనకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది పారిజాతం. దాంతో ఈ రోజు దాని పుట్టినరోజు అందుకే పంపలేదని కాంచన చెప్తుంది.
అదంతా శివన్నారాయణ వింటాడు. ఫోన్ కట్ చేసిన పారిజాతం.. విన్నారుగా ఇక ఈ డబ్బు నాకే అని తీసుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. పిన్ని ఫోన్ చేసింది శౌర్య పుట్టినరోజు అని చెప్పేసానని చెప్తుంది. ఆ తర్వాత దీప కోసం కార్తీక్ కిచెన్ లోకి వెళ్తాడు. అమ్మ తాతయ్య దగ్గరుంది. నిన్ను రమ్మంటున్నారని తీసుకొని వెళ్తుంది. వెళ్లేసరికి అందరు హాల్లో ఉంటారు. మేమ్ ఈవినింగ్ త్వరగా వెళ్తామని కార్తీక్ అనగానే ఎందుకని శివన్నారాయణ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |